1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Airtel is giving free 5GB data to new prepaid customers

ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్.. ప్రీ-పెయిడ్ కస్టమర్లు 5జీబీ డేటాను వాడుకోవచ్చా?

Airtel
ఎయిర్‌టెల్ సంస్థ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు కొత్త ఆఫర్‌ను అందిస్తోంది. తద్వారా ప్రీ-పెయిడ్ కస్టమర్లకు 5జీబీ డేటాను ఉచితంగా అందించనుంది. అయితే ప్రీపెయిడ్ కస్టమర్లు ఇప్పటి వరకు 3జీని మాత్రమే వాడుతూ ఉండాలి. లేదా కొత్త 4జి కస్టమర్ అయి ఉండాలి. 3జి వాడేవారు 4జికి అప్ గ్రేడ్ అయి కొత్త 4జి సిమ్‌ను తీసుకున్నా లేదా కొత్తగా 4జి ప్రీపెయిడ్ సిమ్‌ను తీసుకున్నా వారు ఈ ఆఫర్ కింద 5జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చు.
 
ఇక కస్టమర్లు సిమ్ యాక్టివేట్ అయిన 30 రోజుల్లోగా ఫోన్‌లో ఎయిర్‌టెల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అందులో ఉండే కూపన్స్ విభాగం ద్వారా మొత్తం 5 కూపన్లు పొందవచ్చు. ఒక్కో కూపన్‌కు 1జీబీ డేటా ఉచితంగా వస్తుంది. దాన్ని మూడు రోజుల్లోగా వాడుకోవాల్సి ఉంటుంది. 3 రోజులు దాటితే ఆటోమేటిగ్గా డేటా ఎక్స్‌పైర్ అవుతుంది. ఇక ఆ కూపన్లను 90 రోజుల్లోగా వాడుకోవాల్సి ఉంటుంది. వాడకపోతే ఎక్స్‌పైర్ అవుతాయి. ఇలా కస్టమర్లు ఉచితంగా డేటాను పొందవచ్చు.
తర్వాతి కథనం
ప్రేమించిన అమ్మాయిని చంపేశాడు.. వేరొక వ్యక్తితో లవ్ ఎఫైర్ వుందని..?