శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (16:40 IST)

ప్రేమించిన అమ్మాయిని చంపేశాడు.. వేరొక వ్యక్తితో లవ్ ఎఫైర్ వుందని..?

తాను ప్రేమించిన అమ్మాయికి మరొకరితో లవ్ ఎఫైర్ వుందనే అనుమానంతో తాను ప్రేమించిన అమ్మాయిని కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన యూపీలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బల్లియా జిల్లా లక్ష్మీపూర్‌కి చెందిన రితిక (18)ను ఆమె పక్కింట్లో ఉండే సయ్యద్ అలీ ప్రేమించాడు. ఆమెతో మాట్లాడేందుకు.. ఆమెకు దగ్గరయ్యేందుకు అతడు ప్రయత్నించేవాడు. యువతి కూడా అతనితో బాగానే మాట్లాడేది. ఈ క్రమంలో ఉపాధి కోసం అలీ ఢిల్లీకి వెళ్లాడు. 
 
ఇటీవలే గ్రామానికి తిరిగొచ్చాడు. అప్పటి నుంచి రితికతో అలీ.. చనువుగా ఉండేందుకు ప్రయత్నించాడు. కాని ఆమె అతడిని దూరం పెట్టింది. ఆమెకు మరొకరితో లవ్ ఎఫైర్ ఉందన్న అనుమానంతో అలీ దారుణానికి తెగబడ్డాడు. తన స్నేహితులతో కలసి పొలం దగ్గరకు వెళ్తున్న యువతిని కాపుకాసి కిరాతకంగా హత్య చేశాడు. ఆ దారుణాన్ని కళ్లారా చూసిన స్థానికులు అతడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.