పొరుగింటి బాలికపై 4 నెలలుగా అత్యాచారం.. గర్భం రావడంతో..

victim girl
victim girl
సెల్వి| Last Updated: బుధవారం, 1 జులై 2020 (23:06 IST)
కరోనా వంటి వ్యాధులు భయపెడుతున్నా.. కామాంధుల అకృత్యాలు ఆగట్లేదు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై ఆగడాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా కామాంధుడు విరుచుకుపడుతున్నారు. తాజాగా 14 ఏళ్ల యువతిపై పొరుగింటి 14 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన యూపీలోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది.

నాలుగు నెలల పాటు బాలికపై బాలుడు అత్యాచారానికి పాల్పడటంతో.. ప్రస్తుతం బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించే ఆ బాలుడు.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడేవాడని పోలీసుల విచారణలో తేలింది.

అయితే కడుపునొప్పి కారణంగా బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. వైద్యులు బాలిక గర్భంగా వున్నట్లు నిర్ధారించారు. ఇక పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.దీనిపై మరింత చదవండి :