1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. CCI imposes Rs 1,338-crore fine on Google for 'anti-competitive practices

గూగుల్‌కు మరోమారు రూ.1,338 కోట్ల జరిమానా

Google
ప్రముఖ సెర్చింజన్, టెక్ దిగ్గజం గూగుల్‌కు మరోమారు చుక్కెదురైంది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మళ్లీ భారీ అపరాధం వధించింది. తాజాగా రూ.1,338 కోట్ల మేరకు జరిమానా విధించింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైస్ ఎకో సిస్టమ్ తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తుందన్న కారణంతో సీసీఐ ఈ తరహా చర్య తీసుకుంది. 
 
నిజానికి వారం రోజుల క్రితం రూ.936.44 కోట్ల మేరకు జరిమానా విధించింది. ఈ ఘటన నుంచి తేరుకోకముందే గూగుల్‌పై సీఐఐ మరోమారు కొరఢా ఝుళిపించింది. గూగుల్ ప్లే స్టోర్ పాలసీలకు సంబంధించి పోటీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందంటూ సీసీఐ ఆరోపించింది. పైగా, నిర్దేశిత గడువులోగా తన వైఖరిని మార్చుకోవాలని గూగుల్‌ను సీసీఐ ఆదేశించింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
భార్యాభర్తల మధ్య ఘర్షణం - కొడుకుతో కలిసి రైలుకు ఎదురుగా నిలబడి భర్త...