సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2022 (11:39 IST)

గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ వచ్చేస్తుంది.. ఫీచర్లు ఇవేనా?

googlepixel7
గూగుల్ సిరీస్ నుంచి మరో మొబైల్ స్మార్ట్ ఫోను మార్కెట్‌లోకిరానుంది. గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ పేరుతో ఇది అందుబాటులోకి రానుంది. దీన్ని రెండు మోడళ్లలో ప్రవేశపెట్టనుంది. గూగుల్ పిక్సెల్ 7, గూగుల్ పిక్సెల్ 7 ప్రో సిరీస్ పేరుతో అందుబాటులోకి తీసుకునిరానుంది. 
 
ఇటీవలే మొబైల్ దిగ్గజ కంపెనీ యాపిల్ తన ఐఫోన్ 14 సిరీస్ పేరుతో కొత్త ఫోనును విజయవంతంగా ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. దీంతో గూగుల్ పిక్సెల్ 7 సిరీస్‌ ఫోన్ కోసం ఆసక్తిగా ఎదురు చూడాల్సిన సమయం ఆసన్నమైంది. 
 
ఈ ఫోనును వచ్చే నెల ఆరో తేదీన ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇంది తెలుపు, పగడపు రంగుల్లో అందుబాటులో ఉండనున్నాయి. గతంలో మాదిరిగానే పంచ్ హోల్ డిస్‌ప్లే డిజైన్‌ను కలిగివుంటుంది. పిక్సెల్ 6 కంటే స్టాండర్డ్ మోడల్ మరింత కాంపాక్ట్‌గా ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
పిక్సెల్ 7ప్రో మోడల్ అదే స్క్రీన్ పరిమాణాన్ని కలిగివుంటుందని చెబుతున్నారు. పిక్సెల్ 7 ఫోన్ 6.7 అంగుళాలు, 120 హెచ్‌జడ్ ప్యానెల్‌తో రావొచ్చని భావిస్తున్నారు. సాధారణ వెర్షన్‌లో 90 హెచ్‌జడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.3 అంగుళాల స్క్రీన్‌ను కలిగివుండొచ్చని భావిస్తున్నారు.