శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (14:29 IST)

బగ్ ఉన్నట్టు గుర్తిస్తే రూ.25 లక్షలు ఇస్తాం : గూగుల్

Google
సెక్యూరిటీ పరిశోధకులకు గూగుల్ ఓ సవాల్ విసిరింది. తన ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ ‌గూగుల్ ఓఎస్ఎస్‌లో బగ్స్‌ను గుర్తించి చెప్పినవారికి 31,337 డాలర్లు (రూ.25 లక్షల) బహుమతి ఇస్తామని ప్రకటించింది. ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌లో గుర్తించిన ప్రతి లోపానికి ఇంత మొత్తం రాదు. దాని తీవ్రత ఆధారంగా ఇచ్చే మొత్తం 100 డాలర్ల నుంచి 31,337 డాలర్ల వరకు ఉంటుంది. 
 
ఈ కార్యక్రమానికి బంగ్ బౌంటీ పోగ్రామ్ అని గూగుల్ పేరు పెట్టింది. పరిశోధనలకు ప్రోత్సహించినట్టు తెలిపింది. నిబంధనలు జాగ్రత్తగా చదవాలని కోరింది. ఒకవేళ గుర్తించిన లోపం అసాధారణంగా ఉంటే వారితో కలిసి పని చేస్తామని గూగుల్ ప్రకటించింది. 
 
నగదు బహుమానానికి అదనంగా, ప్రజా గుర్తింపు కూడా లభిస్తుందని పేర్కొంది. నగదు బహుమతి గెలుచుకున్న వారు ఆ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇస్తే రెట్టింపు మొత్తాన్ని అందిస్తామని గూగుల్ తెలిపింది.