1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Googles new messaging app Chat prone to cyber attacks, warns Amnesty

గూగుల్ మెస్సేజింగ్ యాప్‌పై విమర్శలు.. వాట్సాప్‌తో పోటీ పడలేదన్న ఆమ్నేస్టి

సెర్చింజన్ గూగుల్ ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటోంది. చాట్ పేరుతో మెస్సేజింగ్ యాప్‌‌తో పూర్తి రక్షణ లేదంటూ ఆమ్నేస్టి ఇంటర్నేషనల్ వ్యాఖ్యానించింది. ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ లేకుండా అందించే ఈ సేవలు నేరస

Google
సెర్చింజన్ గూగుల్ ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటోంది. చాట్ పేరుతో మెస్సేజింగ్ యాప్‌‌తో పూర్తి రక్షణ లేదంటూ ఆమ్నేస్టి ఇంటర్నేషనల్ వ్యాఖ్యానించింది. ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ లేకుండా అందించే ఈ సేవలు నేరస్థులకు ఓ బహుమానంగా ఉపయోగపడతాయని ఆమ్నేస్టి ఇంటర్నేషనల్ తెలిపింది.
 
మెస్సేజింగ్ యాప్స్‌కు ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉండడం తప్పనిసరి అవసరమని టెక్నాలజీ కంపెనీలకు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గుర్తు చేసింది. ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ సాంకేతికత ఉంటే సందేశాన్ని పంపిన వారు, అందుకున్న వారు మినహా మరెవరూ, చివరికి కంపెనీ కూడా చూడలేదని వెల్లడించింది. 
 
అలాగే గూగుల్ సరికొత్త యాప్ ప్రభుత్వ గూఢచర్యానికి ఇది చక్కగా పనికొస్తుందని తెలిపింది. ఇది గూగుల్‌కు తిరోగమన చర్యగానే మిగిలిపోతుందని గూగుల్ చెప్పుకొచ్చింది. గూగుల్ ప్రవేశపెట్టిన ఈ మెసేజింగ్ యాప్.. వాట్సాప్, ఐ మెస్సేజ్‌లతో పోటీ పడలేదని ఆమ్నేస్టి తెలిపింది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ మెస్సెంజర్, యాపిల్ ఐ మెస్సేజ్ రెండు సేవలు కూడా ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉన్నవేనని ఆమ్నేస్టి చెప్పుకొచ్చింది.
About Writer
selvi
తర్వాతి కథనం
బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహితీవేత్త బాలాంత్రపు రజనీకాంతరావు కన్నుమూత