1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Woman sues Twitter, Facebook and Google over Paris attacks

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్‌‌పై కేసు.. ఉగ్రవాదులు పెరిగిపోయేందుకు...

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు విచ్చలవిడిగా పెరిగిపోయేందుకు సోషల్ మీడియానే కారణమని పారిస్ ఉగ్రదాడి బాధితురాలు కోర్టుకెక్కింది. 2015లో జరిగిన పారిస్ ఉగ్రదాడిలో మొత్తం 130 మంది మృతి చెందారు. ఆ సమయంలో ఓ కేఫ

Twitter
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు విచ్చలవిడిగా పెరిగిపోయేందుకు సోషల్ మీడియానే కారణమని పారిస్ ఉగ్రదాడి బాధితురాలు కోర్టుకెక్కింది. 2015లో జరిగిన పారిస్ ఉగ్రదాడిలో మొత్తం 130 మంది మృతి చెందారు. ఆ సమయంలో ఓ కేఫ్‌లో ఉన్న షికాగో చెందిన మండి పాల్‌ముక్కి బాధితురాలిగా మిగిలారు. ఈ నేపథ్యంలో గతవారం ఆమె షికాగో కోర్టులో ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్‌పై దావా వేస్తూ ఇస్లామిక్ ఉగ్రవాదం పెరిగేందుకు మూడు పరోక్షంగా దోహదం చేస్తున్నాయని ఆరోపించారు.
 
ఉగ్రదాడి జరిగినప్పుడు తానున్న కేఫ్‌లో తన కళ్లముందు పలువురు మరణించడం చూసిన తాను మానసికంగా కుంగిపోయినట్లు లాసూట్‌తో తెలిపారు. ఈ ఉగ్రదాడి తమపనేనని ఐసిస్ ప్రకటించిన తరుణంలో.. సామాజిక మాధ్యమాలే కారణమంటూ ఆమె ఆరోపించారు. దీనిపై ఫేస్‌బుక్ యాజమాన్యం స్పందించింది. తమ సైట్లో ఉగ్రవాదానికి కానీ, అలాంటి అంశాలకు చోటులేదని వివరణ ఇచ్చింది. అలాంటి పనులకు తాము మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసింది. అయితే ట్విట్టర్, గూగుల్ స్పందించలేదు.
About Writer
selvi
తర్వాతి కథనం
ఈశాన్య రాష్ట్రాల్లో అస్థిరతకు చైనా, పాక్ పక్కా ప్లాన్ వేస్తున్నాయ్: ఆర్మీ చీఫ్