సోషల్ మీడియా ద్వారా వేధింపులు.. టెక్కీ అరెస్ట్.. ఎక్కడ?
మహిళను సోషల్ మీడియా ద్వారా లైంగిక వేధింపులకు గురిచేసిన టెక్కీని సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్ గ్రామానికి చెందిన బండ్ల హేమంత్ క
మహిళను సోషల్ మీడియా ద్వారా లైంగిక వేధింపులకు గురిచేసిన టెక్కీని సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్ గ్రామానికి చెందిన బండ్ల హేమంత్ కుమార్ (24).. హైదరాబాద్ కేపీహెచ్చీ కాలనీలో వుంటున్నాడు. ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.
అయితే హేమంత్ కుమార్ పదో తరగతి చదువుకునే సమయంలో సహ విద్యార్థినితో ఫేస్ బుక్ ద్వారా చాటింగ్ చేసేవాడు.
ఆమెకు 2012లో వివాహం జరిగినా.. నకిలీ ఖాతాతో ఆమెకు అసభ్యకర సందేశాలు పంపేవాడు. ఇంకా సోషల్ మీడియా ద్వారా వేధించిన అతనని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు టెక్కీ అరెస్ట్ చేశామని.. ఐపీ వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించామని పోలీసులు తెలిపారు