సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (17:22 IST)

ప్రియా వారియర్‌పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?(వీడియో)

ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో ఏంటంటే.. కేరళ నటి ప్రియా వారియర్ ''ఒరు అడార్ లవ్'' అనే చిత్రంతో ఆమె సినీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రం వచ్చే నెల మార్చి 3న

ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో ఏంటంటే.. కేరళ నటి ప్రియా వారియర్ ''ఒరు అడార్ లవ్'' అనే చిత్రంతో ఆమె సినీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రం వచ్చే నెల మార్చి 3న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలోని ఓ పాటకు ఆమె కన్నులతో చేసే సైగ కుర్రకారును ఎంతో ఆకట్టుకుంటోంది.  ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమె చేసే ఎక్స్‌ప్రెషన్ యూత్‌ను కట్టిపడేసింది. అయితే ఈ సినిమా ఎక్స్‌ప్రెషనే ప్రియా వారియర్‌కు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. 
 
కేరళ నటి ప్రియా వారియర్ పై హైదరాబాదులోని ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ఓ పాటలో ఆమె నటించిందంటూ ఫిర్యాదులో ఆరోపించారు. ముస్లిం యువకులు ప్రియా వారియర్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
కేవలం 26 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఈ టీనేజర్ అందంతో పాటు ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. ఈ వీడియోతో ఓవర్‌నైట్‌లో ప్రియా వారియర్ నేషనల్ స్టార్ అయిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు భారీ ఎత్తున ఫాలోవర్స్ యాడ్ అయ్యారు.