మంగళవారం, 14 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. వాలెంటైన్స్ డే
Written By pnr
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (14:51 IST)

ప్రేమికుల దినోత్సవం : హైదరాబాద్ నగరంలో బెస్ట్ గేట్‌వేస్ ఏవి?

ఈనెల 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం. ఈ వేడుకలను ఒక పండుగలా జరుపుకునేందుకు ప్రేమ జంటలు సిద్ధమైపోయాయి. ఇందుకోస తమ బడ్జెట్‌కు తగ్గినట్టుగా, తమకు అనుకూలంగా ఉండే రొమాంటిక్ గేట్‌వేలను ఎంపిక చేసుకుంటున్నారు.

ఈనెల 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం. ఈ వేడుకలను ఒక పండుగలా జరుపుకునేందుకు ప్రేమ జంటలు సిద్ధమైపోయాయి. ఇందుకోస తమ బడ్జెట్‌కు తగ్గినట్టుగా, తమకు అనుకూలంగా ఉండే రొమాంటిక్ గేట్‌వేలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో ఉన్న రొమాన్స్ కేంద్రాలను పరిశీలిస్తే...
 
హుస్సేన్‌ సాగర్ ‌- నెక్లెస్‌ రోడ్‌ : తథాగతుని చెంత ఉన్న హుస్సేన్‌సాగర్‌, దగ్గరలోని లుంబినీ పార్క్‌ - ఎన్‌టీఆర్‌ గార్డెన్స్‌, ఈట్‌స్ట్రీట్‌ వంటి ప్రాంతాలు ప్రేమికులకు అనుకూలంగా ఉంటాయి.
 
కేబీఆర్‌ పార్క్‌ : నగర నడిబొడ్డున ప్రకృతి సోయగంతో విరాజిల్లుతుందీపార్క్‌. చేతిలో చేయి వేసుకుని ఈ పార్క్‌లో నడుచుకుంటూ ఎన్నో జ్ఞాపకాలను నెమరువేసుకోవచ్చు. ప్రేమలో మునిగే వారు, ఇప్పటికే మునిగిన వారు ఈ పార్క్‌లో ఎంత దూరం నడిచినా అలసట అనిపించదు.
 
అనంతగిరి హిల్స్‌ : నగరానికి కాస్త దూరంగా, వికారాబాద్‌ దగ్గర ఉన్న అనంతగిరి హిల్స్‌... రొమాంటిక్‌ డెస్టినేషన్‌గా ప్రేమికులకు నిలుస్తుంది.
 
షామీర్‌పేట లేక్‌ : ఏకాంతంగా ప్రకృతి ఒడిలో సేదతీరుతూ వలస పక్షుల కిలకిల రాగాలు వినాలనుకుంటే ఇది ఎంతో అనుకూలమైన ప్రాంతం.
 
సీక్రెట్‌ లేక్‌ : ఒకప్పుడు సీక్రెట్‌ లేక్‌గా ఇప్పుడు దుర్గం చెరువుగా ప్రసిద్ధిగాంచిన ఈ సహజసిద్ధమైన చెరువు లవర్స్‌కు మాత్రం ఎప్పటికీ అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి.
 
తారామతి - బారాదరి : చరిత్రలోకి తొంగిచూస్తూ మధురస్మృతులలో జారిపోవాలనుకుంటే తారామతి - బారాదరి కూడా అత్యుత్తమ గేట్‌వేలలో ఒకటిగా చెప్పవచ్చు. వారాంతాలలో అయితే గజల్స్‌, ఖవ్వాలీలను కూడా ఇక్కడ ఆస్వాదించవచ్చు.