ప్రేమికుల దినోత్సవం స్పెషల్ : వీడియోను మళ్లీమళ్లీ చూస్తున్నారు

ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం. వాలంటైన్స్ డే. దీన్ని పురస్కరించుకుని మలయాళంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఆ చిత్రం పేరు "ఒరు ఆదార్ లవ్". హైస్కూల్‌లో జరిగే ప్రేమకథా చిత్రం.

girl
pnr| Last Updated: సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (11:20 IST)
ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం. వాలంటైన్స్ డే. దీన్ని పురస్కరించుకుని మలయాళంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఆ చిత్రం పేరు "ఒరు ఆదార్ లవ్". హైస్కూల్‌లో జరిగే ప్రేమకథా చిత్రం. వచ్చే నెల ఐదో తేదీన రిలీజ్‌కానుంది. ఈ మూవీకి సంధించి మాణిక్య మలరాయ పూవీ పేరుతో సాంగ్ రిలీజ్ అయ్యింది.

అందులో హీరోహీరోయిన్ మధ్య తరగతి గదిలో జరిగే లవ్ ట్రాక్‌ని అద్భుతంగా చిత్రీకరించారు. ఇందులో మాటలు ఉండవు. హీరోహీరోయిన్ కనురెప్పలు ఎగరేయటం.. కన్ను కొట్టటం అంతే.. ఈ సీన్లు చూసినోళ్లు.. మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ముచ్చటగా ఉందంటూ అందరికీ షేర్లు చేస్తున్నారు. జస్ట్ 72 గంటల్లో సాంగ్‌కు 50 లక్షల వ్యూస్ వస్తే.. వారి హావభావాలతో ఉన్న 26 సెకన్ల క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లో అతి కొద్ది సమయంలో ఎక్కువ షేర్లు అయిన క్లిప్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. వాలెంటైన్స్ డే వీక్ నడుస్తుండటంతో.. ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఈ 26 సెకన్ల క్లిప్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమజంటలు తమ ఫోన్‌లో స్టేటస్‌గా పెట్టుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది. ఆ వీడియోనూ మీరూ చూసి ఎంజాయ్ చేయండి.


దీనిపై మరింత చదవండి :