శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (11:17 IST)

కాళ్ళపారాణి ఆరకముందే.. భర్తపై లైంగిక వేధింపుల కేసు...

బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. కాళ్ల పారాణి ఆరకముందే ఓ నూతన వధువు తన భర్తపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. దీంతో పోలీసులు నూతన వరుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నా

బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. కాళ్ల పారాణి ఆరకముందే ఓ నూతన వధువు తన భర్తపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. దీంతో పోలీసులు నూతన వరుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పాట్నాకు చెందిన ఓ యువతికి వైభవ్ అనే వరుడితో వివాహం జరిగింది. పెళ్లి అయిన ఆరు గంటలలోపే పెళ్లికూతురు అదే ముస్తాబుతో పోలీసు స్టేషన్‌కు చేరుకుని.. తన భర్త వైభవ్ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తూ, చంపేస్తాననని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. కట్నం డిమాండ్ చేస్తున్నాడని కూడా ఆరోపించింది. 
 
దీంతో పోలీసులు నూతన వరుడిపై కేసు నమోదు చేసి.. సదరు కొత్త పెళ్లికొడుకును పోలీసులు అరెస్టు చేసి, విచారణ ప్రారంభించారు. వివాహం జరిగిన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వీరిని చూసిన వరుడు కంగుతిన్నాడు. పోలీసులు అతన్నిఅదుపులోకి తీసుకున్నారు. నగరంలో ఈ వార్త సంచలనంగా మారింది.