శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (10:41 IST)

గూగుల్‌లో మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్స్ లిస్ట్‌‌లో కేరళ కుట్టి

ఒక్క క‌న్నుగీటుతో అటు సినీ, ఇటు సోషల్ మీడియా ప్ర‌పంచాన్ని మంత్ర‌ముగ్ధుల్ని చేసిన నటి ప్రియా ప్రకాష్ వారియర్. ఈమె తాజాగా శృంగార తార స‌న్నీ లియోన్‌ను వెన‌క్కి నెట్టేసింది. 'మ‌పిల్ల ప‌ట్టు' సాంగ్‌లో వారి

ఒక్క క‌న్నుగీటుతో అటు సినీ, ఇటు సోషల్ మీడియా ప్ర‌పంచాన్ని మంత్ర‌ముగ్ధుల్ని చేసిన నటి ప్రియా ప్రకాష్ వారియర్. ఈమె తాజాగా శృంగార తార స‌న్నీ లియోన్‌ను వెన‌క్కి నెట్టేసింది. 'మ‌పిల్ల ప‌ట్టు' సాంగ్‌లో వారియ‌ర్ హావభావాలు, క‌ను సైగలు యువ‌కుల హృద‌యాలను కొల్ల‌గొట్టాయి. దీంతో రాత్రికి రాత్రే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోవర్ల సంఖ్య ఆరున్నర లక్షలు పెరిగింది. తాజాగా బాలీవుడ్ సెక్స్‌బాంబ్ సన్నీ లియోన్‌ను మించిపోయింది. 
 
అంతేనా, గూగుల్‌లో మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్స్ లిస్ట్‌లో సన్నీని వెనక్కి నెట్టి తొలి స్థానంలో ప్రియా ప్రకాశ్ నిలిచింది. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కాగానే.. అసలు ఎవరీ ప్రియా అంటూ నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. గూగుల్ అనలిటిక్స్ రిపోర్ట్‌లో సన్నీని ప్రియా మించినట్లు తేలింది. ఈ ఇద్దరి తర్వాతి స్థానాల్లో కత్రినా కైఫ్, అనుష్క శర్మ, దీపికా పదుకోనే ఉన్నారు. 18 ఏళ్ల ఈ కేరళ కుట్టి నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా పెద్ద స్టార్ అయిపోయింది.