శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (15:46 IST)

ప్రియ వారియర్ సైగలకు ఫిదా అయిన బన్నీ.. ఏమన్నాడంటే?

''ప్రియ వారియర్'' సైగలే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాలెంటైన్ డేను పురస్కరించుకుని అమ్మడు సైగలే చర్చనీయాంశంగా మారాయి. ఇంకా ట్రెండింగ్‌లో ప్రియ వారియర్ పేరొచ్చింది. రాత్రికి రాత్రే అమ్

''ప్రియ వారియర్'' సైగలే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  వాలెంటైన్ డేను పురస్కరించుకుని అమ్మడు సైగలే చర్చనీయాంశంగా మారాయి. ఇంకా ట్రెండింగ్‌లో ప్రియ వారియర్ పేరొచ్చింది. రాత్రికి రాత్రే అమ్మడు సెలెబ్రిటీగా మారిపోయింది. ఇక ప్రియ వారియర్ లుక్‌పై టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫిదా అయ్యాడు. 
 
ప్రియ క్యూట్స్ లుక్స్‌పై అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ.. ఈ మధ్య కాలంలో తాను చూసిన చాలా క్యూట్ వీడియో ఇదని తెలిపాడు. సింప్లిసిటీ పవర్ ఇలా వుంటుందని ట్వీటిచ్చాడు. ''ఒరు ఆదార్ లవ్'' అనే మలయాళ సినిమా లోని మాణిక్య మలరయ పూవి అనే పాటలో ప్రియ లుక్స్ తో ఉన్న వీడియో మాత్రం ఇప్పుడు సెన్సేషన్ గా మారింది.