మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (21:43 IST)

బస్సులో పక్కసీట్లో పురుషుడు హస్తప్రయోగం... వీడియో అప్‌లోడ్ చేసిన అమ్మాయి...

ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన ఓ యువతి బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో మధ్యవయస్కుడైన ఓ పురుషుడు దారుణంగా, అత్యంత జుగుప్సకరంగా ప్రవర్తించిన ఘటన వెలుగుచూసింది. ఫిబ్రవరి 7వ తేదీన సదరు యువతి బస్సులో ప్రయాణిస్త

ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన ఓ యువతి బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో మధ్యవయస్కుడైన ఓ పురుషుడు దారుణంగా, అత్యంత జుగుప్సకరంగా ప్రవర్తించిన ఘటన వెలుగుచూసింది. ఫిబ్రవరి 7వ తేదీన సదరు యువతి బస్సులో ప్రయాణిస్తుండగా తన ప్రక్కనే నడివయస్కుడు ఒకరు వచ్చి కూర్చున్నారు. కొద్దిసేపటికే అతడు హస్తప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. అలా చేస్తూ అతడు తన వ్యక్తిగత భాగాన్ని సదరు యువతి నడుముకు తగిలించే ప్రయత్నం చేశాడు. 
 
ఈ జుగుప్సకర ఘటనకు యువతి భీతిల్లిపోయింది. ఈ తంతునంతా తోటి ప్రయాణికులు చూసినా పట్టనట్లు వదిలేశారు. కానీ ఆ యువతి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెక్షన్ 354 మరియు సెక్షన్ 294 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.