మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 22 అక్టోబరు 2017 (11:01 IST)

అద్దంలో యువతిని చూస్తూ హస్తప్రయోగానికి పాల్పడిన ఉబెర్ క్యాబ్ డ్రైవర్

ఉబెర్ క్యాబ్ డ్రైవర్ ఓవరాక్షన్ చేశాడు. ఢిల్లీ వెళ్లే విమానాన్ని అందుకోవాలని ఉబెర్‌ క్యాబ్ ఎక్కిన యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఆ యువతిని చూస్తూ.. ఉబెర్ క్యాబ్ డ్రైవర్ హస్తప్రయోగానికి దిగడంతో ఖంగుతింది

ఉబెర్ క్యాబ్ డ్రైవర్ ఓవరాక్షన్ చేశాడు. ఢిల్లీ వెళ్లే విమానాన్ని అందుకోవాలని ఉబెర్‌ క్యాబ్ ఎక్కిన యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఆ యువతిని చూస్తూ.. ఉబెర్ క్యాబ్ డ్రైవర్ హస్తప్రయోగానికి దిగడంతో ఖంగుతింది. అయితే కేకలు పెట్టి కారును ఆపి.. పోలీసులకు ఫోన్ చేయడంతో.. ఉబెర్ క్యాబ్ డ్రైవర్ అరెస్ట్ అయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే.. కొండాపూర్‌లో నివాసం ఉంటున్న ఉమా శర్మ అనే యువతి, ఈ నెల 19న ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకుంది. ఆపై కారు ఔటర్ రింగ్ రోడ్ పైకి వెళ్లిన తరువాత డ్రైవర్ అసలు స్వరూపం బయటపడింది. కారులో ఉమా శర్మ ఎక్కిన తర్వాత కారు వేగాన్ని 50 కిలోమీటర్ల వరకు డ్రైవర్ తగ్గించేశాడు. అద్దంలో ఆమెను చూస్తూ హస్తప్రయోగానికి పాల్పడ్డాడు. చుట్టూ మరే వాహనాలూ లాకపోవడంతో ఆ యువతి కేకలు పెట్టింది. దీంతో ఉబెర్ క్యాబ్ డ్రైవర్ కారు ఆపేశాడు. 
 
ఢిల్లీలో దిగగానే 1091కు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పాటు, సఫ్దర్ జంగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వారి నుంచి అందిన సమాచారంతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి క్యాబ్ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.