శనివారం, 13 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (16:28 IST)

రోడ్డు ప్రమాదం.. విద్యాబాలన్‌ క్షేమం.. సింధు మేనన్ తల్లికి గాయాలు..

డర్చీ పిక్చర్ ఫేమ్, బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే తృటిలో పెను ప్రమాదం తప్పింది. ముంబైలోని బాంద్రాకు ఓ మీటింగ్ కోసం వెళుతుండగా విద్యా బాలన్‌ను మరో కారు ఢీకొంది. ఈ ప్ర

డర్చీ పిక్చర్ ఫేమ్, బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే తృటిలో పెను ప్రమాదం తప్పింది. ముంబైలోని బాంద్రాకు ఓ మీటింగ్ కోసం వెళుతుండగా విద్యా బాలన్‌ను మరో కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు బాగా డ్యామేజ్ కాగా.. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

చిన్న గాయాలతో విద్యాబాలన్ సురక్షితంగా బయటపడ్డారని జాతీయ మీడియా వెల్లడించింది. ప్రస్తుతం విద్యాబాలన్ నటిస్తున్న 'తుమ్హారీ సులూ' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇందులో ఆమె లేట్ నైట్ రేడియో జాకీ పాత్రను పోషిస్తోంది. నవంబర్ 24న ఈ సినిమా విడుదల కానుంది. 
 
మరోవైపు దక్షిణాది హీరోయిన్.. చందమామ ఫేమ్ సింధుమీనన్ తల్లి శ్రీదేవి కూడా రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. బంధువుల ఇంటికి వెళ్లడం కోసం శ్రీదేవి ఆటో ఎక్కారు. బెంగళూరులోని మత్తికెర సర్కిల్ వద్ద ఆటో ఎక్కిన వెంటనే.. ఆటోను వెనక నుంచి వచ్చిన ఓ క్యాబ్ ఢీకొంది. దీంతో, ఆటోలో ఉన్న సింధు తల్లికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన శ్రీదేవిని వదిలేసి.. ఆటో మ్యాన్, క్యాబ్ డ్రైవర్ గొడవ పడ్డారు. 
 
స్థానికులు కూడా శ్రీదేవికి సాయం చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో వేరే దారిలేక శ్రీదేవి ఫోన్ చేయడంతో సింధు సోదరుడు ఆమెను స్థానిక రామయ్య ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెకు ఛాతీలో బలమైన గాయాలైనట్టు వైద్యులు తెలిపారు.