ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 24 ఆగస్టు 2017 (13:32 IST)

రోడ్డు ప్రమాదంలో కన్నడ బుల్లితెర నటీనటుల దర్మరణం

కర్ణాటక రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నడ నటీనటులు దుర్మరణం పాలయ్యారు. మృతులు రచన (23), జీవన్ (25)లుగా గుర్తించారు. వీరిద్దరు మహానది, త్రివేణి సంగమ, మధుబాల వంటి కన్నడ సీరియల్స్‌లలో నటించారు.

కర్ణాటక రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నడ నటీనటులు దుర్మరణం పాలయ్యారు. మృతులు రచన (23), జీవన్ (25)లుగా గుర్తించారు. వీరిద్దరు మహానది, త్రివేణి సంగమ, మధుబాల వంటి కన్నడ సీరియల్స్‌లలో నటించారు. 
 
కన్నడ బుల్లితెరకు చెందిన రంజిత్, ఉత్తమ్, హోన్నేష్, కార్తిక్, ఎరిక్‌లతో కలిసి జీవన్, రచన బెంగుళూరు సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రానికి వెళ్లారు. బుధవారం కార్తీక్ బర్త్‌డే సందర్భంగా పూజలు నిర్వహించి అక్కడే బర్త్‌డే పార్టీ చేసుకుని గురువారం తెల్లవారు జామున సఫారీ కారులో తిరుగు ప్రయాణమయ్యారు. 
 
కారు కర్ణాటకలోని మాగుడి తాలుకా సోలూరు సమీపంలోని జాతీయరహదారి వద్దకు రాగానే.. రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రచన, జీవన్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన ఇతర నటులను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.