సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 15 అక్టోబరు 2017 (17:22 IST)

ప్రేయసి కళ్లముందే కాలిపోతుండగానే ప్రియుడు పారిపోయాడు..

ప్రేమించిన యువతి కష్టాల్లో వుంటే ఆ ప్రేమికుడు పారిపోయాడు. ప్రేమించిన యువతి కళ్లముందే కాలిపోతుండగా.. పారిపోయాడు. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే... ట్యాక్సీ డ్రైవర్‌గా

ప్రేమించిన యువతి కష్టాల్లో వుంటే ఆ ప్రేమికుడు పారిపోయాడు. ప్రేమించిన యువతి కళ్లముందే కాలిపోతుండగా.. పారిపోయాడు. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే... ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా ప్రవర్తించాడు. తాను నడుపుతున్న కారుకి మంటలు అంటుకోవడంతో కారులోని ప్రేయసిని రక్షించకుండానే దూరంగా పరిగెత్తాడు. 
 
రహదారిపై జరిగిన ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. భారత సంతతికి చెందిన 25 ఏళ్ల హర్లీన్ గ్రేవాల్ అనే యువతి కారులోనే సజీవదహనమైందని పోలీసులు గుర్తించారు. ఈ ట్యాక్సీని నడుపుతున్న సయీద్ అహ్మద్ అనే 23 ఏళ్ల యువకుడు కారులోని యువతిని రక్షించకుండా పరుగులు తీశాడు. 
 
ప్రేయసి కాలిపోతుండగానే హాస్పిటల్‌కు వెళ్లాలంటూ వేరే కారు డ్రైవర్లను సహాయం కోరి హాస్పిటల్‌కు వెళ్లాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు లైసెన్స్ రద్దు చేస్తున్నామని తెలిపారు. హర్లీన్ గ్రేవాల్‌‌తో తాను డేటింగ్ చేస్తున్నానని నిందితుడు అహ్మద్ పోలీసులకు తెలిపాడు.