తమ రాసక్రీడను చూశాడనీ వాచ్‌మెన్‌ను చంపేశారు...

ఓ మహిళతో ఒక ఆటో డ్రైవర్ ఏకాంతంగా ఉన్న దృశ్యాన్ని చూశాడనీ అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌ను చంపేశారు. ఈ దారుణం చెన్నైలోని కోడంబాక్కంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

murder
pnr| Last Updated: సోమవారం, 25 సెప్టెంబరు 2017 (09:46 IST)
ఓ మహిళతో ఒక ఆటో డ్రైవర్ ఏకాంతంగా ఉన్న దృశ్యాన్ని చూశాడనీ అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌ను చంపేశారు. ఈ దారుణం చెన్నైలోని కోడంబాక్కంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

చెన్నై, కోడంబాక్కం వరదరాజుపేట సమీపంలోని ఆరోగ్యస్వామి వీధికి చెందిన సుకుమార్‌ (55) అనే వ్యక్తి నుంగంబాక్కం మేల్‌పాడి ముత్తు వీధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఇదే అపార్ట్‌మెంట్‌లో నివశించే లక్ష్మి (35) అనే మహిళతో అదేప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ హసీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

వీరిద్దరు ఏకాంతంగా ఉండటాన్ని వాచ్‌మెన్ చూసి వారిద్దరినీ మందలించాడు. దీంతో వాచ్‌మెన్‌పై అగ్రహం పెంచుకున్న ఆటో డ్రైవర్ ఆ మహిళతో కలిసి సుకుమార్‌ను హత్య చేశాడు. హత్యకు గురైన విషయాన్ని ఆదివారం ఉదయం గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నుంగంబాక్కం పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని రాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఈ కేసు విచారణలో భాగంగా, లక్ష్మీ వద్ద ఆరా తీయగా, ఆమె పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానించి అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించగా, అసలు విషయం వెలుగుచూసింది. దీంతో ఆటో డ్రైవర్ హాసీని కూడా అరెస్టు చేశఆరు. ఆటోడ్రైవర్‌ పథకం ప్రకారం సుకుమార్‌ను హత్య లక్ష్మి అంగీకరించింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.దీనిపై మరింత చదవండి :