మొన్న కనుసైగతో... నేడు లవ్ తుపాకీతో పేల్చిన ప్రియా వారియర్ (Video)
మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈమె వెండితెర అరంగేట్రం చేస్తున్న తొలి చిత్రం "ఓరు ఆదార్ లవ్". ఈ చిత్రంలోని ఓ పాటను ఇటీవల రిలీజ్ చేశారు.
మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈమె వెండితెర అరంగేట్రం చేస్తున్న తొలి చిత్రం "ఓరు ఆదార్ లవ్". ఈ చిత్రంలోని ఓ పాటను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ పాటలో ప్రియా వారియర్ కనబరిచిన ఎక్స్‌ప్రెషన్స్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయారు.
ఈ నేపథ్యంలో బుధవారం (ఫిబ్రవరి 14వ తదీ) ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ సినిమాలోని మరో వీడియోను విడుదల చేశారు. మొన్న కన్నుగీటుతూ అందరినీ తనవైపునకు తిప్పుకున్న ఈ కుట్టి ఇప్పుడు లవ్ తుపాకీ పేల్చుతున్నట్లు పోజు ఇచ్చి అదరగొట్టేస్తోంది.
ప్రియా హావభావాలు మరోసారి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త టీజర్‌లో ఆమె తన రెండు వేళ్లను గన్‌గా చూపిస్తూ దానిలో ముద్దుని లోడ్ చేసి తన ప్రియుడి వైపు గురి పెట్టి పేల్చింది. దీంతో ఆ యువకుడు ఆ ముద్దు తన గుండెల్లో దిగిపోయినట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోనూ మీరూ చూడండి.