1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. New Judy malware on Android may have infected 36 million devices

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లపై జూడీ పంజా... ఇప్పటికే 3.6 కోట్ల ఫోన్లలో పాగా

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను పెనుముప్పు పొంచివుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులపై జూడీ అనే మాల్‌వేర్ పంజా విసురుతోంది. ఇప్పటికే 3.65 కోట్ల ఫోన్లలో ఈ సైబర్ భూతం పాగా వేసినట్టు వార్తలు వస్తున్

New Judy malware
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను పెనుముప్పు పొంచివుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులపై జూడీ అనే మాల్‌వేర్ పంజా విసురుతోంది. ఇప్పటికే 3.65 కోట్ల ఫోన్లలో ఈ సైబర్ భూతం పాగా వేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వైరస్‌తో అనేక యాప్‌లు కుమ్మక్కవగా.. ఫ్యాషన్, కుకింగ్ గేమ్స్ ముసుగులో గూగుల్ ప్లేస్టోర్‌ని సైతం స్థావరంగా వాడుకున్నాయి. వీటిలో ఓ యాప్ అయితే ఏకంగా సంవత్సరం పాటు గూగుల్ ప్లేస్టోర్లో తిష్టవేయడం విశేషం.
 
సైబర్ సెక్యూరిటీ సంస్థ 'చెక్ పాయింట్' కథనం మేరకు ఒక్కసారి ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటే... ఇక సదరు ఆండ్రాయిడ్ ఫోన్ 'జూడీ' చేతిలోకి వెళ్లినట్టే. ఇన్‌స్టాల్ చేసింది మొదలు.. ఈ మాల్‌వేర్ సదరు ఫోన్ నుంచి యూజర్‌కి తెలియకుండానే గూగుల్ యాడ్‌లను క్లిక్ చేయడం మొదలు పెడుతుంది. తద్వారా ప్రకటనల ఆదాయం సైబర్ దొంగల జేబుల్లోకి వెళుతుంది. అనుమానాస్పదంగా కనిపించిన కొన్ని యాప్‌లను ఇప్పటికే ఏరివేసింది. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
లైంగిక టార్చర్ భరించలేకపోతున్నా.. చచ్చేలోపు సొంతూరికి చేర్చండి... ప్లీజ్