సంబంధిత వార్తలు
- పూర్వం మాదిరిగా తప్పించుకునే పరిస్థితి లేదు.. ఎండార్స్ చేసినా కేసు పెడుతున్నారు.. మంత్రి ధర్మాన
- జూన్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.116 కోట్లు
- బీసీసీఐకు కాసుల వర్షం.. ఐసీసీ నుంచి రూ.9424 కోట్ల ఆదాయం
- టీటీడీ సరికొత్త రికార్డు.. కోవిడ్ తర్వాత పెరిగిన వసూళ్లు
- ఏపీకి శుభవార్త చెప్పిన కేంద్రం .. రెవెన్యూ లోటు కింద రూ.879 కోట్లు
రెండు రోజుల్లోనే నాలుగు లక్షల ఐఫోన్లు కొన్నారట!
ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ప్రస్తుతం స్పెషల్ సేల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఐఫోన్స్ కూడా భారీ డిస్కౌంట్స్‌తో అందుబాటులోకి వచ్చాయి. దీంతో యాపిల్ ఫ్యాన్స్ ఈ ఫోన్ల కోసం ఎగబడ్డారు.
దేశవ్యాప్తంగా రెండు రోజుల్లోనే నాలుగు లక్షలకుపైగా ఐఫోన్లు కొనుగోలు చేశారట. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో ఐఫోన్లపై కనీసం రూ.10 వేలకుపైగా డిస్కౌంట్ లభించింది.
అలా ఫ్యాన్స్ నాలుగు లక్షలకు పైగా ఐఫోన్లను కొనుగోలు చేశారు. అది కూడా రెండు రోజుల్లోనే కొనుగోలు చేయడం విశేషం. ఐఫోన్ సిరీస్ ఫోన్ల అమ్మకం ఆఫ్‌లైన్ సేల్స్ కన్నా.. ఆన్‌లైన్ సేల్స్ ఎక్కువగా ఉన్నాయి.
