బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 16 జులై 2023 (18:08 IST)

జూన్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.116 కోట్లు

ttd temple
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లోని శ్రీవారి హుండీ ఆదాయం జూన్ నెలలో రూ.100 కోట్లు దాటేసింది. జూన్ నెలలో స్వామి వారిని దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 23 లక్షలుగా ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే, గత నెలలో 1.06 కోట్ల మేరకు శ్రీవారి లడ్డూలను విక్రయించినట్టు వెల్లడించారు. గత నెలలో స్వామివారి హుండీ ద్వారా రూ.116.14 కోట్ల మేరకు ఆదాయం వచ్చినట్టు తెలిపింది. 
 
మొత్తం 23 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోగా, 10.8 లక్షల మంది భక్తులు తలనీనాలు సమర్పించారు. 24.38 లక్షల మంది భక్తులు తిరుమల కొండపై అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు టీటీడీ 1.06 కోట్ల లడ్డూలను విక్రయించింది. 
 
కాగా, ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేకుండా క్యూ లైన్లలో వచ్చిన భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. శనివారం స్వామివారిని 871,71 మంది భక్తులు దర్శించుకున్నారు. 38,273 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.