గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 జూన్ 2023 (10:01 IST)

తిరుమలలోని టీ కప్పులో శిలువ గుర్తు.. సీజ్ చేసిన టీటీడీ

Tea Cup
Tea Cup
తిరుమలలోని ఓ టీ దుకాణంలో అందిస్తున్న టీ కప్పులో శిలువ ఉండడంతో దేవస్థానం అధికారులు దుకాణానికి సీజ్ చేయడం కలకలం రేపింది. తిరుపతి తిరుమల ప్రాంతంలో హిందూ మతం మినహా ఇతర మతపరమైన చిహ్నాలను తీసుకురావడం నిషేధించబడిన సంగతి తెలిసిందే. అయితే కొందరు రహస్యంగా ఇతర మత చిహ్నాలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. 
 
ఈ సందర్భంలో తిరుపతి శ్రీవారి దేవాలయం ఉన్న తిరుమలలోని ఓ టీ దుకాణంలో పేపర్ కప్పుపై శిలువ ఉన్నట్టు తెలిసింది. దీంతో శిలువ గుర్తు ఉన్న దుకాణానికి దేవస్థానం అధికారులు సీజ్ వేసినట్లు సమాచారం. ఈ ఘటన తిరుమలలో కలకలం రేపింది.