గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 జూన్ 2023 (12:30 IST)

ధోనీ ఒక్కడే ప్రపంచ కప్ గెలిచాడా? హర్భజన్ సింగ్

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కడే మైదానంలో ఆడి ప్రపంచకప్ గెలిచాడా అని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశ్నించారు. 2007లో ఒంటరిగా ఆడుతూ టీ20 ప్రపంచకప్ గెలిచిన ఏకైక యువ ఆటగాడు ధోనీ? మరో పది మంది ఆటగాళ్లు జట్టులో ఆడట్లేదా? ప్రతి ప్రపంచకప్‌లోనూ ధోనీ ఒక్కడే బరిలోకి దిగి కప్ గెలిచాడా.. అంటూ వరుస ప్రశ్నలు గుప్పించాడు భజ్జీ. 
 
ఆస్ట్రేలియా లేదా మరేదైనా ప్రపంచ కప్ గెలిస్తే, ఆ దేశం గెలిచిందంటారు. అయితే భారత్ గెలిస్తే మాత్రం ధోనీ విజయంగా భావిస్తారు. గెలుపు ఓటమి మొత్తం జట్టుకే చెందుతుందని హర్భజన్ సింగ్ అన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్ విజయం ధోనీ వల్లే సాధ్యమైందని ట్విట్టర్‌లో పోస్ట్‌లు చేస్తున్న చాలా మందికి హర్భజన్ సింగ్ ఈ వ్యాఖ్యలతో సమాధానం ఇవ్వడం గమనార్హం. 
 
కెప్టెన్ అయిన 48 గంటల్లోనే టీ20 వరల్డ్ కప్ గెలిచాడు అంటూ ధోనీపై ట్విట్టర్‌లో వస్తున్న వ్యాఖ్యలపై భజ్జీ ఫైర్ అయ్యాడనే చెప్పాలి.