గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 జూన్ 2023 (13:08 IST)

కృతి సనన్‌ను ముద్దుపెట్టుకుని, హత్తుకున్నాడు.. ఓం రౌత్‌పై నెటిజన్లు ఫైర్

Om raut_kriti sanon
Om raut_kriti sanon
ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రభాస్, కృతి సనన్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకుడు. ప్రస్తుతం ఓం రౌత్ చేసిన పనికి ప్రస్తుతం ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. 
 
ఓం రౌత్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని వీరు దర్శించుకున్నారు. అనంతరం గుడి వెలుపల కృతి సనన్‌ను ముద్దుపెట్టుకుని, హత్తుకున్నారు. ఆ తర్వాత కృతి కారెక్కి వెళ్లిపోయింది. సెండాఫ్ ఇచ్చేందుకే కృతిసనన్‌కు ఓం రౌత్ హగ్ ఇచ్చాడు. అయితే ఈ సీన్ చూసిన భక్తులు ఫైర్ అవుతున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఇలాంటి పని ఏంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  
 
దీనిపై బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి స్పందిస్తూ... తిరుమల ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమని, ఇది పిక్నిక్ స్పాట్, షూటింగ్ స్పాట్ కాదన్నారు. స్వామివారి అర్చన సేవలో పాల్గొని ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆలయ మహాద్వారం ముందు ఇలాంటి పని చేయడాన్ని చాలామంది తప్పుబడుతున్నారు. ఇంకా ఓం రౌత్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.