ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

శ్రీవారి సేవలో ప్రభాస్ - సెల్ఫీల కోసం ఎగబడిన భక్తులు

prabhas
టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరో ప్రభాస్ మంగళవారం ఉదయం శ్రీవారి సేవలో పాల్లొన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం "ఆదిపురుష్" చిత్ర తెలుగు వెర్షన్ ఆడియో రిలీజ్ వేడుక మంగళవారం సాయంత్రం తిరుపతి వేదికగా జరుగనుంది. ఇందుకోసం ఆయన తిరుపతికి వచ్చారు. ముందుగా తిరుమలకు చేరుకున్న ఆయన.. తెల్లవారుజామున శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ప్రభాస్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. 
 
సుప్రభాత సేవలో పాల్గొని స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు. ప్రభాస్‌ను ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అదేసమయంలో తమ అభిమాన నటుడు తిరుమలలో కనిపించడంతో ఆయన అభిమానులతో పాటు సాధారణ భక్తులు కూడా సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు.
aadipurush team
 
కాగా, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురిడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఈ నెల 16వ తేదీన పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమం తిరుపతిలో శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.