1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. PUBG Mobile Latest Update : Frustrated PUBG officials requests meeting with ministry

పబ్‌జీ లవర్స్‌కు చేదు వార్త.. భారత్‌లోకి వస్తే టిక్ టాక్ కూడా..?

PUBG Mobile
పబ్‌జీ భారత్‌లో వచ్చేందుకు మరికొంత సమయం పట్టేలా వుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి పబ్‌జీ కార్పొరేషన్‌కి ఇంకా పూర్తీ స్థాయి అనుమతులు రావాల్సి ఉంది.

గతంలో నిషేధింపబడ్డ సంస్థలు తమ వ్యాపార లావాదేవీల కోసం మన దేశంలో ఒక కొత్త సంస్థను ఫ్లోట్ చేసి తీసుకురావడం సరైన విధానం కాదని కేంద్రం తేల్చి చెప్పింది.

ఒక వేళ తిరిగి రావడం అంత సులభం అయితే ఇదే బాటలో టిక్ టాక్ కూడా తిరిగి వచ్చేదని, ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం అని తెలిపింది. దీంతో పబ్‌జీ గేమ్‌కి భారత్‌లోకి ప్రవేశించేందుకు ఇంకా టైమ్ పట్టేలా వుంది.  
 
కాగా కేంద్ర ప్రభుతం నిషేధం విధించిన తర్వాత తిరిగి భారత్ లోకి "పబ్‌జీ మొబైల్ ఇండియా" పేరుతో గ్లోబల్ వెర్షన్ కి భిన్నంగా రావాలని ప్రయత్నిస్తుంది. దీంతో పబ్‌జీ అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

భారత్ దేశంలో పబ్‌జీ గేమ్‌ని పూర్తీ స్థాయిలో తీసుకొచ్చేందుకు, అన్ని విధానాలను పూర్తీ చేసి ఈ నెల మొదటి వారంలో తీసుకురావాలని భావించింది. కానీ, దీనికి కేంద్ర ప్రభుత్వ శాఖ అయిన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఈఐటివై) నుంచి పూర్తీ స్థాయి అనుమతులు మాత్రం రాలేదు.
తర్వాతి కథనం
భారత మార్కెట్లోకి లెనోవా నుంచి సరికొత్త ల్యాప్‌టాప్