1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Coronavirus Outbreak Updates: India reports 41000 New Positive Cases

దేశంలో మరో 41 వేల కరోనా పాజిటివ్ కేసులు

Coronavirus Outbreak Updates
దేశంలో మరో 41 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం కేంద్రం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ విషయం తెలిపింది. ఈ హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 41,100 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 88,14,579 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 42,156 మంది కోలుకున్నారు.
 
అలాగే, గడచిన 24 గంట‌ల సమయంలో 447 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,29,635 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 82,05,728 మంది కోలుకున్నారు. 4,79,216 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.              
  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 12,48,36,819 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 8,05,589 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
ఇకపోతే, తెలంగాణలో గత 24 గంటల్లో  661 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 1,637 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,57,374 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,40,545 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,404 కి చేరింది. ప్రస్తుతం 15,425 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
 
వారిలో 12,899 మంది హోంక్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 167 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 57 కేసులు నిర్ధారణ అయ్యాయి.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
విస్తరణవాదం వైపు ప్రపంచం మొగ్గు.. భారత్ మాత్రం వ్యతిరేకం : ప్రధాని మోడీ