మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 నవంబరు 2020 (16:00 IST)

ఈ బుడ్డోడు నా మనసు దోచాడు.. కేటీఆర్ ట్వీట్

Boy
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌కు చిన్నారులంటే చాలా ఇష్టమని చాలా సందర్భాల్లో తెలిపారు. ఇక 14 నవంబర్ 2020 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కేటీఆర్.. ఆసక్తికరమైన ఫోటోను పోస్టు చేశారు. 
 
ఇంకా ఆ ఫోటో ద్వారా ప్రపంచంలో తనకు పిల్లలంటేనే చాలా ఇష్టమని చెప్పారు. నవ్వుతున్న కళ్లతో నవ్వుతున్న ముఖాలు అంటూ పలు ఫోటోలను పంచుకున్న ఆయన.. సనత్‌ నగర్‌లో మంత్రి కేటీఆర్‌ ప్రసంగిస్తన్న సమయంలో ఓ చిన్నారి స్మార్ట్‌ ఫోన్‌ పట్టుకొని కేటీఆర్‌ను ఫోటో తీస్తున్న ఫోటోను షేర్ చేశారు.
 
ఈ ఫోటోను అంతకుముందు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తన ట్విటర్‌ పోస్టు చేయగా.. అదే ఫోటోను కేటీఆర్‌ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 'ఈ చిన్నారి నా హృదయాన్ని దోచుకున్నాడు. నిన్న సనత్ నగర్ నియోజకవర్గంలో పర్యటించాను. పలు వేదికలపై మాట్లాడాను. 
 
ఆ బాలుడు ఈ ఫొటోను ఎక్కడ తీశాడో కచ్చితంగా తెలియదు. కానీ, ఈ చిన్నారి బాగా ఫోకస్ పెట్టి ఫోటో తీశాడు' అంటూ కేటీఆర్ స్మైలీ ఎమోజీని పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో టీఆర్ఎస్ అభిమానులను ఆకట్టుకుంటుంది.