1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. KTR launches building and debris recycling plant

భవన నిర్మాణ, శిథిలాల వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను ప్రారంభించిన కేటీఆర్

KTR
హైదరాబాదు నగరంలో ప్రతిరోజు సుమారు 2 టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. శిథిలాల నిర్వహణలో దక్షణ భారతంలోనే తెలంగాణ బెస్ట్‌గా ఉందని చెప్పారు. జీడిమెట్లలో నిర్మించిన భవన నిర్మాణ, శిథిలాల వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంటును ఈ రోజు కేటీఆర్ ప్రారంభించారు.
 
ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈ ప్లాంటు ద్వారా జీహెచ్ఎంసీ, రాంకీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో వ్యర్థాలను రీసైక్లింగ్ చేయనున్నట్లు చెప్పారు. ఎల్బీనగర్ లోని ఫతుల్‌గూడలో సంక్రాంతి పండుగ నాడు మరో ప్లాంటును ప్రారంభిస్తామని తెలిపారు.
 
నగరంలో మొత్తం 5 ప్లాంట్లను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయవద్దని ప్రజలను కోరారు. చెత్త తరలింపు కోసం టోల్ ప్రీ నెంబరు 1800120072659కి సమాచారం ఇవ్వాలని తెలిపారు.
About Writer
వి
తర్వాతి కథనం
నటుడు కమలహాసన్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన చంద్రబాబు