సంబంధిత వార్తలు
- కలెక్టరు గారు, నాది కనీసం తహశీల్దారు స్థాయి కూడా కాదా? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అసంతృప్తి
- హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం... వందేళ్ల తర్వాత వచ్చిన ఉత్పాతం...
- అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్ పైన నాయిని, పరామర్శించిన మంత్రి కేటీఆర్
- ఆ వ్యాఖ్యలు కేరళ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం : సీఎం పినరయి విజయన్
- వరదలో కూలిన ఇండ్ల గణన వెంటనే పూర్తి చేయాలి: మంత్రి కేటీఆర్
అనాధగా మిగిలిపోయిన బాలికను ఆదుకున్న మంత్రి కేటీఆర్
ఒకేసారి తల్లి దండ్రులతో పాటు తన తోడపుట్టిన సోదరుడిని కోల్పోయి ఓ పన్నెండేళ్ల బాలిక అనాథగా మిగిలింది. ఏ దిక్కు లేకుండా ఆపన్న హస్తాల కోసం ఎదురుచూస్తుంది. ఆ బాలిక విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రభుత్వపరంగా ఆదుకోవాలని ట్విట్టర్ ద్వారా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను ఆదేశించారు.
మంత్రి ఆదేశాల మేరకు ఆ బాలిక గురించిన స్థితిగతులను తెలుసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి సుభద్రకు ఆదేశాలు జారీచేశారు. వెంటనే అక్కడి గ్రామానికి చేరుకొని బాలికను పరామర్శించిన అనంతరం చిర్డ్రన్ వెల్పేర్ సెంటర్‌కు తరలిస్తామన్నారు.
తక్షణ సాయంగా ఆ బాలికకు రూ.30 వేలు ఆర్థిక సాయం అందించారు. ఇతర వసతుల ఏర్పాట్లకై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అప్పటివరకు బంధువులు, గ్రామస్తులు బాలికకు అండగా ఉండాలని కోరారు. ఆమె వెంటనే సీడీపీఓ కవిత, ఏసీడీపీఓ వెంకటమ్మ, సూపర్‌వైజర్ జ్యోతి ఉన్నారు.
