'ఆ' సుఖానికి నిరాకరించింది.. అందుకే స్నేహితులతో కలిసిచంపేశా...

victim
ఠాగూర్| Last Updated: బుధవారం, 21 అక్టోబరు 2020 (15:30 IST)
గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నామనీ, అయితే, తనతో శారీరకంగా కలిసివుండేందుకు తన ప్రియురాలు నిరాకరించడంతో తన స్నేహితులతో కలిసి చంపేసినట్టు ఓ హత్యాచార కేసులోని ప్రధాన నిందితుడు పోలీసులకు చెప్పాడు.

ఈ హత్యాచార ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరాబంకి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బరాబంకి జిల్లాలో 17 ఏళ్ల మైనర్‌ యువతి తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది.

ఈ క్రమంలో గత రెండు రోజులుగా కూతురు కనిపించకపోవడంతో ఆ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు... ఆ యువతి ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు తెలుసుకున్నారు. ఆ తర్వాత సదరు వ్యక్తిని స్టేషన్‌కు పిలిచి విచారించగా అసలు విషయాన్ని వెల్లడించాడు.

యువతి, తాను గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నామని, ఇటీవల తనను కలిసేందుకు, శారీరక సుఖం పంచుకునేందుకు నిరాకరించసాగిందని, అందుకే తన స్నేహితునితో కలిసి హత్య చేసినట్లు వెల్లడించాడు. అయితే, హత్యకు ముందు.. ఆ యువతిపై అత్యాచారం జరిపి, ఆ తర్వాత హత్య చేసి శవాన్ని నీటి కాలువలో పడేసినట్టు వెల్లడించారు.

దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, నిందితులపై హత్యా, సామూహిక అత్యాచారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.దీనిపై మరింత చదవండి :