సంబంధిత వార్తలు
- వైద్యం చేస్తానంటూ యువతిని గర్భవతిని చేసిన వైద్యుడు
- ఇక ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత... స్థానికంలో విజయభేరీ
- ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత విజయం.. భారీ మెజార్టీతో అదుర్స్
- విడాకులు తీసుకున్న మహిళ వేరొక వ్యక్తితో బైకుపై వెళ్తే.. చివరికి ఏం జరిగిందంటే?
- నన్ను వదిలేయ్ అన్నా అంటూ దండంపెడుతున్నా... పెట్రోల్ పోసి తగులబెట్టాడు...
భూత వైద్యం పేరుతో బాలికకు మత్తు మందిచ్చి 3 నెలల పాటు..?
భూత వైద్యం పేరుతో ఓ దొంగబాబా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతుండటంతో మహిళలు ఆ బాబాకు దేహశుద్ది చేశారు. వైద్యం పేరుతో 15 ఏళ్ల బాలికను లొంగదీసుకుని ఆమెకు మత్తుమందు ఇచ్చి మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతుండటంతో ఆ దొంగబాబకు బడితపూజ చేశారు. ఈ ఘటన మంగళవారం నిజామాబాద్‌లో చోటు చేసుకుంది.
అయితే కుటుంబ సమస్యల కారణంగా నిజామాబాద్‌కు చెందిన ప్రసాద్ అనే భూత వైద్యున్ని సదరు బాలిక సంప్రదించింది. సమస్య పరిష్కరిస్తానని అమాయకురాలైన బాలికను బెదిరించి లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా బాలికకు మత్తుమందు ఇచ్చి మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తెలిపింది.
ఈ క్రమంలో బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు స్థానిక మహిళలతో కలిసి బాబాను తీవ్రంగా చితకబాదారు. ఇంకా పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దొంగబాబాను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.