శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 అక్టోబరు 2020 (10:50 IST)

ఇక ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత... స్థానికంలో విజయభేరీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఆమె తెరాస అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 
 
నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో తెరాసకుకు 728 ఓట్లు, బీజేపీకి 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29 ఓట్లు మాత్రమే రాగా, 10 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 823 ఓట్లు పోలయ్యాయి. దీంతో భారీ ఆధిక్యంతో కవిత విజయం సాధించారు.
 
కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సుభాష్‌ రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ పోటీ చేసిన విషయం తెలిసిందే. కవిత‌ గెలుపుతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. కవితకు శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు పంచుకుంటున్నారు.