శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 12 అక్టోబరు 2020 (07:16 IST)

ఖాజీపేట దర్గా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

ఈ నెల 14  15 వ తేదీలలో వరంగల్ జిల్లా ఖాజీపేట దర్గాలో జరుగు హజరత్ సయ్యద్ గులాం అఫ్జల్ బీయాబాని ఉరుసు ఉత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మహా నగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి ఆదేశించారు.

ఆమె డిసిపి పుష్పా, హజరత్ సయ్యద్  గులాం అఫ్జల్ బియాబాని దర్గా  పీఠాధిపతి కుశ్రు పాషాలతో దర్గా ప్రాంతమంతా కలియ తిరుగుతూ దర్గాలో ఉత్సవాల కొరకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు.

జిల్లాలో అతి పెద్ద జాతర అయిన నేపథ్యంలో అధికారులు   నిభందనలు ఖచ్చితంగా పాటిస్తూ పారిశుధ్యాన్ని పక్కడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

గ్రేవ్ యార్డ్ లో వెంటనే పిచ్చి మొక్కలు తొలగించి పరిశుభ్రం చేయలని, తగినంత విద్యుత్ వెలుతురు స్తంభాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తగినన్ని సాని టైజీర్ స్టాండ్లు ఏర్పాటు చేయాలన్నారు.

భక్తులకు అసౌకర్యం కలగకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ ట్రాఫిక్ నియంత్రణ లాంటి చర్యలు  చేపడుతున్నట్లు డిసిపి కె పుష్ప అన్నారు. అదే విధంగా భక్తులు సులువుగా దర్శనం చేసుకొనుటకు బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖాజిపేట ఏసీపీ, బల్దియా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.