శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: మంగళవారం, 13 అక్టోబరు 2020 (18:23 IST)

వైద్యం చేస్తానంటూ యువతిని గర్భవతిని చేసిన వైద్యుడు

తెలంగాణా రాష్ట్రం నిజామాబాద్ నగరంలోని జవహర్ రోడ్డులో ఒక ఆర్ఎంపి వైద్యుడి బాగోతం బయటపడింది. వైద్యం పేరుతో మహిళలపై అఘాయిత్యాలు పాల్పడుతున్నాడు ఆ కామాంధ వైద్యుడు. అయితే ఈ విషయం బయటకు రాకపోవడంతో ఇతని ఆటలు సాగాయి. కానీ 17 యేళ్ళ యువతిని మభ్యపెట్టి గర్భవతి చేయడంతో ఇతని బాగోతం బట్టబయలైంది. 
 
జవహర్ రోడ్డులో నివాసముండే 17 యేళ్ళ బాలికకు కడుపునొప్పి వచ్చింది. తల్లిదండ్రులు అనుమానంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. మీ అమ్మాయి మూడు నెలల గర్భవతిగా ఉందని చెప్పడంతో షాకయ్యారు. యువతిని నిలదీశారు. దీంతో జవహర్ రోడ్డులోని ఆర్.ఎం.పి. డాక్టర్ పేరు చెప్పింది. ఆగ్రహంతో ఊగిపోయిన యువతి బంధువులు ఆర్ఎంపి డాక్టర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. గత మూడు నెలల క్రితం చికిత్స కోసం ఒంటరిగా వెళ్ళిన యువతికి మాయమాటలు చెప్పాడట వైద్యుడు.
 
ఆ తరువాత క్లినిక్‌కు ఆ యువతిని పిలిపించి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరించేవాడు. దీంతో ఆ యువతి వైద్యుడు పిలిచినప్పుడల్లా వెళ్ళేదట. ఇలా మూడు నెలల పాటు ఆ వైద్యుడు ఆమెను లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీస్టేషన్ మరికొంతమంది మహిళలు కూడా వెళ్ళి తమను కూడా మోసం చేశాడంటూ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.