గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2020 (09:12 IST)

తొలి బిడ్డకు ఆహ్వానం పలుకనున్న జహీర్ ఖాన్ దంపతులు!

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ జహీర్ ఖాన్. ఈయన సాగరికా ఘట్కే అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈమె గర్భవతి తేలింది. ప్రస్తుతం ముంబై ఇండియన్ జట్టుకు సేవలు అందిస్తున్న జహీర్ ఖాన్ ఇపుడు యూఏఈలో ఉన్నాడు. అక్కడ జహీర్ ఖాన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. 
 
ఈ వేడుకల్లో సాగరికాతో పాటు.. మరికొంతమంది సెలెబ్రిటీలు పాల్గొన్నారు. ఆ సమయంలో సాగరికా నలుగు రంగు దుస్తుల్లో ఉండగా, ఆమెకు బేబీ బంప్ బాగా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఆమె ఖచ్చితంగా గర్భందాల్చిందని ఆ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఓ నిర్ధారణకు వచ్చారు. 
 
అయితే, ఈ విషయాన్ని జహీర్ ఖాన్ దంపతులు అధికారికంగా ప్రకటించనప్పటికీ, జహీర్ పుట్టిన రోజు వేడుకలు చూసిన వారంతా సాగరిక గర్భవతని తేల్చేశారు. ఈ ఫొటోకు 1.37 లక్షలకు పైగా లైక్స్ రాగా, ఈ శుభవార్తను అధికారికంగా ప్రకటించాలని కామెంట్లు వస్తున్నాయి.
 
మరోవైపు, ఈ యేడాదిలో తల్లి కాబోతున్న సెలబ్రిటీల జాబితాలో అనుష్కా శర్మ, కరీనా కపూర్‌లు చేరిన విషయ తెల్సిందే. ఇపుడు జహీర్ ఖాన్ జంట కూడా తన తొలి బిడ్డకు ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉన్నారని 'ముంబై మిర్రర్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.