గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2020 (10:24 IST)

కజిన్సే ఆ పని చేశారు.. బాలిక గర్భవతి కావడంతో..?

దేశంలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా బాలికలపై దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా ముగ్గరు వ్యక్తులు 12 ఏళ్ల బాలికపై ఐదు నెలల పాటు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆమె గర్భవతి కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెను రేప్ చేసింది కూడా కజిన్సేనని పోలీసులు తెలిపారు. ఈ ఘటన గుజరాత్‌లోని నవ్‌సారీ జిల్లాలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. వ్యవసాయ కూలీ కుమార్తెపై అయిన 12 ఏళ్ల బాలికను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె కజిన్ ఒకరు రేప్ చేశాడు. ఆ తర్వాత అతడు ఈ విషయాన్ని మరో ఇద్దరు కజిన్స్‌కు చెప్పాడు. దీంతో వారు కూడా బాలికను రేప్ చేశారు. ఈ విషయాన్ని ఆమె తల్లికి చెప్పవద్దని బెదిరింపులకు పాల్పడ్డారు. ఇలా ఐదు నెలల పాటు బాలికను పలు సందర్భాల్లో రేప్‌ చేశారు. అయితే నిందితులంతా కూడా 18 ఏళ్ల లోపు వాళ్లే. 
 
కానీ కొద్ది రోజుల క్రితం బాలికకు కడుపు నొప్పి రావడంతో ఆమె తల్లి హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. పరీక్షలు నిర్వహించిన వైద్యలు.. బాలిక నాలుగు నెలల గర్భవతి అని ఆమె తల్లికి తెలిపారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బుధవారం రాత్రి బాలికను మరో ఆస్పత్రికి తరలించారు. 
 
గురువారం మధ్యాహ్నం బాలిక చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు.. బాలికతో పాటు ఆమె తల్లిదండ్రుల స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు బాలుర మీద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అయతే ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు. వారిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టుగా వెల్లడించారు.