మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (19:23 IST)

ఓ గర్భిణీకి అంతకన్నా థ్రిల్లింగ్ ఏముంటుంది... : అనుష్క శర్మ (Video)

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ సినీ నటి అనుష్క శర్మ త్వరలోనే తల్లికాబోతోంది. దీంతో అనుష్కను విరాట్ కోహ్లీ కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఇందులోభాగంగా, తాను ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్ళాల్సి రావడంతో అనుష్కను కూడా కోహ్లీ తన వెంట తీసుకెళ్లాడు. దీంతో అనుష్క కూడా ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షిస్తోంది. 
 
ఈ క్రమంలో సోమ‌వారం రాత్రి బెంగుళూరు రాయ‌ల్స్ ఛాలెంజ‌ర్స్ జ‌ట్టు ఉత్కంఠ రీతిలో ముంబై ఇండియ‌న్స్‌పై విక్ట‌రీ సాధించింది. సూప‌ర్ ఓవ‌ర్ వ‌ర‌కు వెళ్లిన ఆ మ్యాచ్‌లో కోహ్లీ సేన విజ‌యాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆ గెలుపుతో కోహ్లీ భార్య అనుష్కా శ‌ర్మ ఆనందంలో తేలిపోయింది.
 
ఓ గ‌ర్భిణి మ్యాచ్‌ను ఎంజాయ్ చేసేందుకు ఇంత క‌న్నా థ్రిల్లింగ్ ఏముంటుంద‌ని అనుష్కా కామెంట్ చేసింది.  మ్యాచ్ ముగిసిన త‌ర్వాత త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్కా శ‌ర్మ ఈ పోస్టు చేసింది. గ‌ర్భిణి అయిన త‌న‌కు ఆ మ్యాచ్ అమితానందాన్ని ఇచ్చిన‌ట్లు త‌న పోస్టులో అనుష్కా పేర్కొన్న‌ది. 
 
గ‌త రెండు మ్యాచుల్లో కోహ్లీ విఫ‌లం కావ‌డం వ‌ల్ల అత‌నిపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన విష‌యం తెలిసిందే. కామెంటేట‌ర్ గ‌వాస్క‌ర్ చేసిన ఓ కామెంట్ కూడా తీవ్ర దుమారం రేపింది. కోహ్లీ ప‌ర్ఫార్మెన్స్‌పై విమ‌ర్శ‌లు గుప్పుమ‌న్నాయి. ఆ వివాదంలో అనుష్కా శ‌ర్మ కూడా త‌డిసిపోయింది. 
 
అయితే తాజాగా ముంబైతో మ్యాచ్‌లో అద్భుత విజ‌యాన్ని కోహ్లీ బృందం విజ‌యం సాధించ‌డంతో అనుష్కా శ‌ర్మ ఆ ఆనందాన్ని త‌ట్టుకోలేక‌పోయింది.  త‌న ఇన్‌స్టా‌ స్టోరీలో విక్ట‌రీ మూమెంట్ ఫోటోతో పాటు బెంగుళూరు స‌భ్యుల ఫోటోల‌ను కూడా పోస్టు చేస్తూ అనుష్కా కామెంట్ చేసింది.