శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 అక్టోబరు 2020 (08:38 IST)

ములాయం సింగ్ యాదవ్‌కు కరోనా... ఆరోగ్య పరిస్థితి ఏంటి?

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కరోనా వైరస్ చేతికి చిక్కారు. దీంతో ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రికి తరలించి చికిత్స అందుస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 
 
అయితే, ములాయం సింగ్‌ యాదవ్‌లో కరోనాకు సంబంధించిన లక్షణం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదని సమాజ్‌వాదీ పార్టీ అధికారిక ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. ములాయం భార్యకు కూడా కరోనా సంక్రమించినట్టు తెలుస్తోంది. 
 
కాగా, తన తండ్రి ములాయంకు కరోనా వైరస్ సోకడంపై ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పందిచారు. తన తండ్రి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్టు చెప్పారు. 
 
ములాయం ఆగస్టులో కడుపు నొప్పి, మూత్ర సంబంధిత సమస్యలతో లక్నోలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. చాలా రోజుల చికిత్స అనంతరం ఆయన కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు కరోనా కారణంగా మరోమారు ఆసుపత్రిలో చేరారు.