సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 20 జూన్ 2020 (10:49 IST)

బీజేపీ ఎమ్మెల్యే పీఏకు కరోనా.. హోం క్వారంటైన్‌కు రాజా సింగ్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు వరుసగా కరోనా వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే అధికార పక్షానికి చెందిన ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజా సింగ్ గన్‌మ్యాన్‌కి ఈ వైరస్ సోకింది. దీంతో ఎమ్మెల్యే రాజా సింగ్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఈయనకు శనివారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. 
 
కాగా, తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకు 300కు పైగా కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెల్సిందే. శుక్రవారం ఒక్క రోజే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 499 కేసులు నమోదుకాగా, ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఏకంగా 329 కేసులు నమోదయ్యాయి. ఇది హైదరాబాద్ నగరంలో నెలకొన్న పరిస్థితికి అద్దంపడుతోంది.