శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 అక్టోబరు 2020 (14:55 IST)

మూడేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి ఆ పని చేశాడు.. నాన్న స్నేహితుడే..?

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిని ఆమె తండ్రి స్నేహితుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. బాధితురాలి మృతదేహాన్ని ఆ రాష్ట్రంలోని ఘజియాబాద్‌‌లోని కవి నగర్ పారిశ్రామిక వాడలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఆ చిన్నారి తండ్రి స్నేహితుడు చందన్‌ని నిందితుడిగా గుర్తించారు. ప్రధాన నిందితుడు… బాలిక తండ్రితో కలిసి ఇంటి బయట మద్యం సేవించాడు. ఆడుకోవడానికి బాలికను తీసుకురావడానికి చందన్ ఇంటి లోపలికి వెళ్లి ఆ తర్వాత ఆమెను తీసుకుని పారిపోయాడు. బాలికను తీసుకెళ్లిన తర్వాత కాల్ కూడా లిఫ్ట్ చేయలేదని బాలిక తల్లి తెలిపింది. తన కుమార్తెతో ఆడుకోవాలని చెప్పి.. ఎత్తుకెళ్లిపోయాడని తెలిపింది.  
 
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చామని... తర్వాత బాలిక కుటుంబం ఆ ప్రాంతంలో బాలిక కోసం వెతకగా కనపడలేదు. పోలీసులు గాలించగా మృతదేహం దొరికింది. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.