మహారాష్ట్రలో దారుణం.. 2 నెలల మగబిడ్డను చర్చి వద్దనే వదిలేశాడు..

baby boy
baby boy
సెల్వి| Last Updated: శనివారం, 10 అక్టోబరు 2020 (11:36 IST)
మహారాష్ట్రలోని పూణేలో దారుణం జరిగింది. భార్యకు పుట్టిన 2 నెలల బిడ్డను రోడ్డుపైనే వదిలిపెట్టి వెళ్లాడు.. ఓ భర్త. ఇందుకు అనుమానమే కారణమంటూ పోలీసుల విచారణలో తేలింది. తన భార్యకు పుట్టిన విషయంలో అనుమానం పెంచుకున్న భర్త ఆ బిడ్డను వదిలేశాడు. తనకు పుట్టిన వాడు కాదంటూ చర్చి సమీపంలో విడిచిపెట్టేశాడు. అటుగా వెళ్తున్న స్థానికులు పసికందును గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

తరచూ గొడవలు జరుగుతుండటంతో మూడేళ్లుగా విడిగా ఉంటున్నారు. ఇటీవలే వాళ్ల ఐదేళ్ల కొడుకు కోసం కలిశారు. రెండు నెలల క్రితం ఆ మహిళ మరో కొడుక్కి జన్మఇచ్చింది. ఈ సంతానం తనది కాదంటూ అనుమానం పెంచుకున్న భర్త వదిలించుకోవాలనుకున్నాడు. మహారాష్ట్రలోని పూణేలో చర్చి వద్ద కడ్కి అనే ప్రాంతంలో వదిలేశాడు. వృత్తి రీత్యా ఇంజనీర్ అయిన ఆ వ్యక్తిని, అతని భార్యని పోలీసులు అరెస్టు చేశారు.దీనిపై మరింత చదవండి :