మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2020 (18:06 IST)

ఎమ్మెల్యేకు 37 ఏళ్లు, నా కూతురికి 19 ఏళ్లు, భయపెట్టి పెళ్లాడాడు: తమిళనాడు తండ్రి సూసైడ్ యత్నం- Video

ఇటీవలే తమిళనాడు అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభు, సౌందర్య అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి కూడా. అంతా బాగానే వుందని అనుకుంటున్నారు కానీ తన కుమార్తె సౌందర్యను ఎమ్మెల్యే ప్రభు కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నారంటూ ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. 
 
అతడికి 37 ఏళ్లనీ, తన కుమార్తె 19 ఏళ్లనీ, అతడి వయసులో సగం వయసున్న తన కుమార్తెను కిడ్నాప్ చేసి పెళ్లాడారంటూ ఆయన పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటే వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసారు. పోలీసులు అతడిని వారించారు.
 
కాగా సౌందర్య తండ్రి స్వామినాథన్ ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నారు. తన కుమార్తెను ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించినా తను లొంగలేదనీ, దాంతో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారంటూ ఆరోపిస్తున్నారు. ఐతే ఎమ్మెల్యే తరపు బంధువులు మాత్రం మేము దళితలమని ఆయన అలా చేస్తున్నారంటూ ఆరోపించారు.
 
కానీ సౌందర్య తండ్రి ఈ విషయాన్ని కొట్టిపారేసారు. తను కులమతాలను పట్టించుకోననీ, కేవలం అతడికీ తన కుమార్తెకి వయసు అంతరమే తనకు అభ్యంతరమంటూ చెప్పుకొచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టరుకి ఫిర్యాదు చేసారు. కోర్టులో పిటీషన్ కూడా వేస్తామని తెలిపారు.