గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2020 (16:12 IST)

మా డాడీ రాజకీయాలకు సరిపడరు : శృతిహాసన్

విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల కుమార్తె, సినీ నటి శృతిహాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన తండ్రి రాజకీయాల్లోకి రావడం, పార్టీని స్థాపించడంపై ఆమె స్పందించారు. తన తండ్రి ప్రస్తుత రాజకీయాలకు ఏమాత్రం సరిపడరని నిర్మొహమాటంగా చెప్పేశారు. 
 
ప్రస్తుతం తెలుగులో 'వకీల్ సాబ్' చిత్రంతో పాటు 'క్రాక్' సినిమాలో శ్రుతి కథానాయికగా నటిస్తోంది. మరోపక్క, తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న 'లాభమ్' సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం చెన్నై శివారుల్లో జరుగుతున్న ఈ చిత్రం షూటింగులో ఆమె పాల్గొంటోంది. 
 
ఈ సందర్భంగా ఆమె ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ, తనకు తనకు రాజకీయాలు సరిపడవని, అందుకే, వచ్చే ఎన్నికల్లో తన తండ్రి తరపున ప్రచారం చేసేది లేదని తెగేసి చెప్పింది. 
 
అలాగే, తన తండ్రిలో ప్రజలకు ఏదో సేవ చేయాలన్న ఆశ, తపన ఉన్నాయనీ, అందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని, అయితే తనకు రాజకీయాలు సరిపడవని శ్రుతి చెప్పింది. అందుకే, తండ్రి తరపున ఎన్నికల ప్రచారం చేయనని, ఆయన కూడా ఈ విషయంలో తనని అడగరనీ గబ్బర్ సింగ్ బ్యూటీ చెప్పుకొచ్చింది.