శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 సెప్టెంబరు 2020 (10:37 IST)

#COUPLESCHALLENGE యూపీ యువకుడితో హాలీవుడ్ నటి ఫోటో.. వైరల్

Alexandra Daddario
సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఏదో ఒక ఛాలెంజ్‌కు సంబంధించిన వీడియోలు లేదా ఫోటోలు ట్రెండింగ్ అవుతుండటం సాధారణమైన విషయమే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కపుల్ ఛాలెంజ్ అనే పేరిట పలువురు తమ జోడీలతో కూడిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఈ ఛాలెంజ్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో #coupleschallenge అనే హ్యాష్ ట్యాగ్‌ను ఉపయోగించి.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడు పోస్టు చేసిన ఫోటో ప్రస్తుతం హాలీవుడ్ వరకు ట్రెండింగ్ అయి కూర్చుంది. 
 
ఇందుకు కారణం ఆ యువకుడు షేర్ చేసిన ఫోటోలో ప్రముఖ హాలీవుడ్ నటి అలెగ్జాండ్రియా డడ్డాడ్రియో ఫోటోను ఎడిట్ చేసి.. సెల్ఫీ తీసుకున్నట్లు వుండటమే. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను అలెగ్జాండ్రియా కూడా తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేయడం విశేషం. 
 
ఇందుకు భారీగా స్పందన వస్తోంది. ఇలా అలెగ్జాండ్రియా తన ఫోటోను షేర్ చేస్తుందని ఆ యువకుడు ఊహించలేదు. అదే విషయాన్ని ఆ యువకుడు అలెగ్జాండ్రియా ఫోటోకు కామెంట్ చేశాడు. దీంతో #coupleschallengeలో అలెగ్జాండ్రియా యూపీ యువకుడి ఫోటో వైరల్ అవుతోంది.