బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (17:34 IST)

కరోనా వైరస్‌ సోకి బాలీవుడ్ వెటరన్ నటి ఆశాలత కన్నుమూత

కరోనా వైరస్ సోకి మరో సీనియర్ నటి కన్నుమూశారు. ఆమె పేరు ఆశాలత వాబ్‌గోంకర్. వయస్సు 79 యేళ్ళు. బాలీవుడ్‌తో పాటు మరాఠీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందిన ఈమెకు ఓ సీరియల్ షూటింగ్ సమయంలో కరోనా వైరస్ సోకింది. 
 
ఆ తర్వాత ఆమె ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే మంగళవారం కన్నుమూసినట్టు మరో పాపులర్ నటి రేణుకా షహనానే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అలాగే, ట్విట్టర్ ద్వారా ఆమె తన నివాళులు అర్పించారు. 
 
గోవాలో పుట్టిన పెరిగిన ఆశాలత.. ఆ తర్వాత మహారాష్ట్రకు వచ్చి స్థిరపడ్డారు. పిమ్మట టీవీ సీరియల్స్‌లో నటిస్తూ మరాఠీ చిత్రాల్లో నటించే అవకాశం పొందారు. అలా మంచి గుర్తింపు పొందిన ఆమె కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోవడం పట్ల పలువురు మరాఠీ నటీనటులు తమ సంతాపాన్ని తెలుపుతున్నారు.